- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంగ్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
by GSrikanth |
X
దిశ, జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను తెలంగాణలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీ నగరంలో బతుకమ్మ పాటలు మార్మోగాయి. తెలంగాణ బతుకమ్మ అసోసియేషన్ ఆఫ్ కోవెంట్రీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వినాయక దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలు అలరించాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు కోలాటాలతో సందడి చేశారు. మహిళలు చిన్నారులు బతుకమ్మ ఆడి మురిసిపోయారు. సుమారు రెండు గంటల పాటు అలరించిన బతుకమ్మ వేడుకలలో భారత సంతతికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మ ఆడిన అనంతరం సమీపంలోని కొలనులో నిమజ్జనం చేశారు.
Advertisement
Next Story