- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసులు వస్తే ఎలా? మంకీ పాక్స్ ప్రిపరేషన్లపై ఇద్దరు కమిషనర్లు ఆరా!
దిశ, తెలంగాణ బ్యూరో: మంకీ పాక్స్ కేసులు వస్తే ఎదుర్కొనేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా అంటూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వీ కర్ణన్ ఆరా తీశారు. ఆసుపత్రులలో స్టాఫ్, సౌలత్ లు అన్నీ ఉన్నాయా అంటూ డాక్టర్ల ను అడిగి తెలుసుకున్నారు. స్పెషల్ వార్డుల పరిస్థితి, మందుల స్టాక్ వంటి అంశాలపై కూడా చర్చించారు. ఇక సీజనల్ వ్యాధుల సిచ్వేషన్ పై కూడా కర్ణన్ ఆరా తీశారు. డెంగీ వైరస్ ను కట్టడి చేయాలని అధికారులకు సూచించారు.
సీఎం ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ లోని కీలక హెచ్ వోడీలంతా ఆసుపత్రుల విజిట్ బాట పట్టారు. దీనిలో భాగంగానే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్ బుధవారం ఫీవర్ ఆసుపత్రి విజిట్ చేసి వ్యాధుల పరిస్థితి, కేసుల వివరాలు, మంకీ పాక్స్ ప్రిపరేషన్ ను పరిశీలించారు. వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఈ నెల 30న కూడా ఆయన కొండాపూర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, చేవెళ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించనున్నారు. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ కూడా గాంధీ ఆసుపత్రిని విజిట్ చేశారు. పలు వార్డులు తిరుగుతూ పేషెంట్లకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. రోగులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వార్డులు, వాష్ రూమ్ లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని గాంధీ ఆసుపత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. పేషెంట్లకు సకాలంలో చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. టీవీవీపీ కమిషనర్ ఈ నెల 30న పటాన్ చెరు ఏరియా హాస్పిటల్, మేడ్చల్ పీహెచ్సీని సందర్శించనున్నారు. అంతేగాక బుధవారం డీపీహెచ్ రవీందర్ నాయక్ ఉస్మానియా దవాఖానకు, డీఎంఈ వాణి కోఠి జిల్లా దవాఖాన విజిట్ చేసి జ్వర కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఆయా దవాఖానల్లో వసతులు, పరికరాలు, మందుల నిల్వ వంటివి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ కేడర్ల వైద్యాధికారులు, డాకర్లు పాల్గొన్నారు.