వేరే రాష్ట్రాల్లో చదివితే నాన్ లోకల్ ఎలా అవుతారు : హైకోర్ట్

by M.Rajitha |
వేరే రాష్ట్రాల్లో చదివితే నాన్ లోకల్ ఎలా అవుతారు : హైకోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : వైద్య కళాశాలల్లో నీట్ సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో 33 మీద హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో పర్మినెంట్ అడ్రస్ ఉండి కేవలం రెండేళ్ళు వేరే రాష్ట్రాల్లో చదివినంత మాత్రాన వాళ్ళు నాన్ లోకల్ ఎలా అవుతారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్ట్. స్థానికులు, స్థానికేతరుల మీద స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించిన తర్వాత జీవో తీసుకు రావాల్సిందని అభిప్రాయ పడింది. కాగా పర్మినెంట్ అడ్రస్ ఉన్నవారంతా స్థానిక కోటాకు అర్హులేనని తేల్చిన హైకోర్ట్.. స్థానికత మీద ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, వాటి ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

అసలేంటీ వివాదం..

నీట్ వైద్య సీట్ల అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ రూల్ '3ఏ'ను జతచేస్తూ జీవో 33ని జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సావరణ ప్రకారం 9వ తరగతి నుండి ఇంటర్ వరకు తెలంగాణలో తప్పనిసరిగా చదివి ఉన్నవాళ్ళు మాత్రమే స్థానిక కోటా కింద వైద్య సీట్ల భర్తీకి అర్హులు. దీనిని సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కొత్త జీవో వలన ఇతర రాష్ట్రాల విద్యార్థులు, భారతీయ మూలాలున్న ప్రవాసులు ఇక్కడ కేవలం నాలుగేళ్ళు చదువుకుంటే 85% స్థానిక కోటాకు అర్హులు అవుతారని, దీనివల్ల నష్టపోయేది రాష్ట్ర విద్యార్థులేనని పిటిషనర్ తరపున న్యాయవాదులు కోర్టులో వాదించారు.

Next Story

Most Viewed