మెగా డీఎస్సీతో నేరవేరిన యువత ఆశలు : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

by M.Rajitha |
మెగా డీఎస్సీతో నేరవేరిన యువత ఆశలు : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేయడమంటే నిరుద్యోగుల కండ్లలో ఆనందం చూసేందుకేనని చెప్పారు. మొత్తం 11 వేల 62 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 2,629, లాంగ్వేజ్ పండిట్ 727, పీఈటీలు 182, ఎస్ జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 ఉన్నాయని వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులు విడుదల చేసి, యువతకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు విద్యను బలోపేతం చేస్తామని అన్నారు. అయితే, ప్రతిపక్షాలు రాష్ట్రంలో రాజకీయం చేయడమే పనిగా పెట్టుకున్నాయని, మంచి పని చేస్తే ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదని, బురద చల్లడం సహేతుకం కాదని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed