తెలంగాణ మహిళ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్

by Satheesh |   ( Updated:2023-03-06 03:06:19.0  )
తెలంగాణ మహిళ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకున్న రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రత్యేక క్యాజువల్ లీవ్‌గా పరిగణించి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సాధారణ పరిపాలన శాఖ ఆదివారం జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నది. ఉమ్మడి రాష్ట్రం ఉనికిలో ఉన్నప్పటి నుంచీ ఈ వెసులుబాటు అమలులో ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో (నెం. 433)కు అనుగుణంగా ఈ సర్క్యులర్‌ను ఇచ్చింది.

తెలంగాణ ఎన్జీవో అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీఏడీలోని సర్వీసు విభాగానికి చెందిన సెక్రటరీ బీ.వెంకటేశ్వరరావు ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కొన్ని విభాగాల అధికారులు ఉమ్మడి రాష్ట్ర జీవోను అమలు చేయడంలేదని టీఎన్జీవో నేతలు గుర్తుచేయడంతో ఇకపైన ఈ సర్క్యులర్‌కు అనుగుణంగా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు దీన్ని అమలుచేయాలని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

కౌన్ బనేగా ఎమ్మెల్సీ.. అధికార పార్టీ నుంచి పోటీలో ఉండేది ఎవరు..?

అక్రమ నిర్మాణాలు.. ఆఫీసర్ల నో మానిటరింగ్!

Advertisement

Next Story