ఖదీర్ ఖాన్ మరణంపై వివరణ ఇవ్వండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

by GSrikanth |   ( Updated:2023-10-02 09:10:50.0  )
ఖదీర్ ఖాన్ మరణంపై వివరణ ఇవ్వండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెదక్ పోలీసులు దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన ఖదీర్ ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మెదక్ ఎస్పీ, డీఎస్పీ, ఎస్ హెచ్ఓకు హైకోర్టు ఆదేశించింది. ఓ గొలుసు చోరీ కేసులో అనుమానంతో విచారణకు పిలిపించిన మెదక్ పోలీసులు ఖదీర్ ఖాన్ ను తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పోలీసుల చేతిలో గాయాలపాలైన ఖదీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత వారం మృతిచెందాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన లాకప్ డెత్ పై పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టులో హాజరుపరిచిన 14 రోజులకు ఖదీర్ మరణించినట్లు అదనపు ఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఖదీర్ మృతికి కారణాలపై విచారణ జరుపుతామన్న చీఫ్ జస్టీస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ మార్చి 14కు వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed