- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి పువ్వాడకు షాక్.. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నోటీసులు!
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మమత మెడికల్ కాలేజీ ఛైర్మన్ హోదాలో శుక్రవారం పువ్వాడకు కోర్టు నోటీసులు జారీ చేసింది. పీజీ వైద్య కోర్సులకు 2016 జీవో ప్రకారమే పాత ఫీజులు తీసుకోవాలని వైద్య కళాశాలలకు గతేడాది హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పువ్వాడ అజయ్ కుమార్ ఛైర్మన్‌గా ఉన్న మమత మెడికల్ కాలేజీ మాత్రం పీజీ వైద్య కోర్సులకు 2017 జీవో ప్రకారం పెంచిన ఫీజులు విద్యార్థుల వద్ద నుంచి వసూలు చేసింది.
అధిక ఫీజులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కాలేజీలు వసులూ చేసిన ఫీజులను తిరిగి విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశించిన మమత మెడికల్‌కాలేజీ తమకు రావాల్సిన ఫీజు తిరిగి ఇవ్వడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఇంకా ఫీజులు ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని పువ్వాడ అజయ్‌కి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ 17కి హైకోర్టు వాయిదా వేసింది.