మ్యాక్స్​ మంతెనకు ఊరట.. ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్​ కొట్టివేత

by Vinod kumar |   ( Updated:2023-08-22 15:01:28.0  )
TS High Court Asks Government to file Report on Right to Education
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ సంస్థ మ్యాక్స్​ మంతెన గ్రూపుపై మనీ లాండరింగ్ ​చట్టం ప్రకారం ఈడీ నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాక్స్​మంతెన గ్రూప్​ప్రమోటర్​రాజును నిర్ధోషిగా గుర్తించింది. ఈ మేరకు తీర్పు వెలువరించిన జస్టిస్​లక్ష్మణ్​ఈ కేసులో విచారణను కొనసాగిస్తే అది మ్యాక్స్​మంతెన గ్రూప్​నకు న్యాయం చేయనట్టే అని వ్యాఖ్యానించారు. భోపాల్​కు చెందిన ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్​డిపార్ట్​మెంట్​ఓ ఈ టెండర్​కు సంబంధించిన వ్యవహారంలో కేసులు నమోదు చేశారు. దీంట్లో పలువురిని నిందితులుగా పేర్కొన్నారు.

అయితే, ట్రయల్​కోర్టులో ఎకనామిక్​ ఇన్వెస్టిగేషన్ ​డిపార్ట్​మెంట్​ అధికారులు నమోదు చేసిన కేసులు వీగిపోయాయి. కాగా, ఈ టెండర్ వ్యవహారంలో 80వేల కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగాయని, దీంట్లో మనీ లాండరింగ్​చట్ట ఉల్లంఘటనలు జరిగాయన్న అనుమానంతో హైదరాబాద్​జోన్​ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్​జారీ చేశారు. భోపాల్ ​ఎకనామిక్​ ఇన్వెస్టిగేషన్ ​డిపార్ట్​మెంట్​ నమోదు చేసిన ఎఫ్ఐఆర్​ను దీనికి ప్రాతిపదికగా తీసుకున్నారు. అయితే, ఈడీ అధికారులు మనీ లాండరింగ్​జరిగినట్టుగా కోర్టుకు సాక్ష్యాధారాలను సమర్పించ లేకపోయారు. ఈ క్రమంలోనే హైకోర్టు మ్యాక్స్​మంతెన గ్రూప్​పై ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్​ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story