HIGH ALERT : మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో హై అలర్ట్!

by Sathputhe Rajesh |
HIGH ALERT : మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో హై అలర్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లాలో మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో హై అలర్ట్ కొనసాగుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. గుత్తికోయ గూడాలలో ఇప్పటికే పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించి అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో కొత్త వారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు.

Advertisement

Next Story