Rave Party: దేవుళ్లం కాదంటూ.. తప్పును ఒప్పుకున్న హేమ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-27 16:14:58.0  )
Rave Party: దేవుళ్లం కాదంటూ.. తప్పును ఒప్పుకున్న హేమ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇటీవల నోటీసులు అందుకున్న తెలుగు నటి హేమ తాజాగా మరో వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో హేమ లైవ్‌‌లో తన ఫ్యాన్స్‌తో మాట్లాడారు. తాను బానే ఉన్నానని.. థింక్ పాజిటివ్.. మనసులో ఏం పెట్టుకోవద్దన్నారు. ఎవరేమన్నా ఊరుకోవద్దని సూచించారు. మనం తప్పు చేయనంత వరకు ఎదుటివారికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక వేళ మనం తప్పు చేసిన మనమేం దేవుళ్లం కాదు అన్నారు. పొరపాటు జరిగినా సారీ చెప్పుచ్చని.. అప్పుడే మనం ఫ్రెష్‌గా ఉంటామన్నారు. ఒక్క అబద్ధం చెబితే దాన్ని కవర్ చేయడానికి వంద అబద్ధాలు ఆడాలి. అందుకే అబద్ధాలు ఆడకుండా ఉండటమే బెటర్ అన్నారు. ప్రస్తుతం హేమ తన ఫ్యాన్స్‌తో లైవ్‌లో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Read More...

BREAKING: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం.. విచారణకు నటి హేమ డుమ్మా

Advertisement

Next Story