Telangana Rains : అతలాకుతలమైన హైదరాబాద్.. స్తంభించిన రాకపోకలు

by GSrikanth |   ( Updated:2023-09-05 04:50:11.0  )
Telangana Rains : అతలాకుతలమైన హైదరాబాద్.. స్తంభించిన రాకపోకలు
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులపై భారీగా వర్షం నీరు చేరింది. ఫలితంగా మెయిన్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. కారణంగా రాకపోకలు స్తంభించాయి. పలు ప్రైవేట్ విద్యాలయాలు సెలవులు ప్రకటించాయి. గాజులరామారంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు, అత్యల్పంగా కేపీహెచ్‌బీలో 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు వెల్లడించారు. మంగళ, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని జీహెచ్ఎంసీ అధికారులు నగరవాసులకు సూచించారు. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో రెండు రిజర్వాయర్ల నాలుగు గేట్లను ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎత్తి, దిగువకు 1715 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ కమిషనర్

నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. జంట నగరాల దాహార్తి తీర్చే జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తి వెస్తునన్నందున మూసి పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సహాయం కోసం జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్ 04- 2111 1111 గాని డయల్ 100 కు గాని, ఈవీడియం డీఆర్ బృందాల సహాయం కోసం 9000113667 కు ఫోన్ చేయవచ్చునని అధికారులు తెలిపారు.




Advertisement

Next Story