దసరాకు భారీగా మద్యం అమ్మకాలు

by Y. Venkata Narasimha Reddy |
దసరాకు భారీగా మద్యం అమ్మకాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగకు భారీగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. దసరా సందర్భంగా మద్యం అమ్మకాలకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని లిక్కర్ గౌడన్ల నుంచి ముందుగానే మద్యం నిల్వలను దుకాణాలకు, బార్, రెస్టారెంట్లకు తరలించి అమ్మకాలు సాగిస్తున్నారు. ఫుల్లుగా స్టాక్ పెట్టుకున్నారు. మద్యం ప్రియులు మూడునాలుగైదు రోజుల నుంచే మద్యం కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో 2,260మద్యం దుకాణాలు, 1,171బార్, రెస్టారెంట్లు ఉన్నాయి.

గత ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 2,826కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. 2024సెప్టెంబర్ 30వరకు 2,838.92కోట్ల అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ముందుండగా, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

Next Story