భారీ వర్షాలు.. హైదరాబాద్ వాసులకు మంత్రి తలసాని కీలక సూచన

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-05 04:47:39.0  )
భారీ వర్షాలు.. హైదరాబాద్ వాసులకు మంత్రి తలసాని కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా నగర ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని హైదరాబాద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ వాసులు అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. అత్యవరసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలన్నారు. జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ 040-2111 1111కు ఫోన్ చేయాలన్నారు. ఈవీడీఎం కంట్రోల్ రూమ్ 9000113667కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.

Advertisement

Next Story