భారీ వర్షాలు.. ప్రతిపక్షాలకు కేటీఆర్ కీలక సూచన

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-27 09:10:14.0  )
భారీ వర్షాలు.. ప్రతిపక్షాలకు కేటీఆర్ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ పరధిలోని పలు కాలనీల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పరిశీలించిన ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు కానీ ప్రాణ నష్టం జరగకుడదనేదే తమ ఉద్దేశ్యమన్నారు. పాఠశాలలకు సెలవులు తగ్గించడం ద్వారా నగరంలో ట్రాఫిక్ తగ్గిందన్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 185 చెరువులు ఉన్నాయని వర్షాకాలం ముందే చెరువులు వద్ద సెఫ్టీ చర్యలు చేపట్టామన్నారు.

అధికారులు ఎప్పటికప్పుడు చెరువుల సామర్థ్యం 2 ఫీట్లు తక్కువ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. సహాయక చర్యల విషయంలో జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ రెస్పాన్స్ టీం సహాయక చర్యలు వెంటనే చేపడుతున్నారన్నారు. విపత్తు సమయంలో రాజకీయ పార్టీలు రాజకీయాలు పక్కనబెట్టి సహాయక చర్యల్లో ముందుండాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకుంటే అది వారి అజ్ఞానమన్నారు. ప్రభుత్వం హై అలర్ట్‌గా ఉందన్నారు. సమర్ధంగా విపత్తును ఎదుర్కుంటామన్నారు.

Read More : భారీ వర్షాలు.. హైదరాబాద్ ముంపుపై నెటిజన్లు ఫైర్

Advertisement

Next Story

Most Viewed