- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heavy Rainfall Alert : భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: రానున్న మరో గంటలో.. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రానికి హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌లో వచ్చే ఐదు రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని తెలిపారు.
నగరంలో అడపాదడపా వర్షాలు కురుస్తాయన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం అప్రమత్తమైంది.