తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

by Mahesh |
తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ నెల 16 అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ తెలంగాణ రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటం తో.. ఆదివారం(18న) మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. అలాగే తెలంగాణలోని 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ఈ రోజు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మంచిర్యాల, ఆదిలాబాద్‌,కరీంనగర్‌, సిరిసిల్ల,ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, మహబూబాబాద్‌, నుమకొండ,వరంగల్‌, హ జనగాం జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే సిద్దిపేట, యాదాద్రి హైదరాబాద్, , రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇప్పటికే, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు అన్ని నిండి పారుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Advertisement

Next Story