మరో ఐదు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన

by Mahesh |   ( Updated:2024-08-31 13:37:09.0  )
మరో ఐదు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శుక్రవారం నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇదిలా ఉంటే మధ్యాహ్న సమయానికి ఉపరితల ద్రోణి కాస్త తీవ్ర అల్పపీడనంగా మారడంతో తెలంగాణలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో రానున్న ఐదు గంటల్లో రాష్ట్రంలోని ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ఇప్పటికే ఖమ్మంలో 180 మీ.మీ. వర్షపాతం నమోదు కాగా మిగిలిన జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed