వికారాబాద్‌లో భీకర వడగండ్ల వాన.. (వీడియో)

by Mahesh |   ( Updated:2024-05-31 07:36:03.0  )
వికారాబాద్‌లో భీకర వడగండ్ల వాన.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పలు చోట్లలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాలోని మార్పల్లిలో వడగండ్ల వాన భారీ ఎత్తున కురిసింది. దీంతో ఆ ప్రాంతం అంతా మంచు ప్రదేశం వలె మారిపోయింది. దీంతో అక్కడి ప్రజలు ఆ వాతావరణాన్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కొంత మంది తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. కాగా ఈ వడగండ్ల వర్షానికి సంబంధించిన వీడియో కొద్ది సేపటికే రాష్ట్రం మొత్తం వైరల్ గా మారింది.

Advertisement

Next Story