రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద భారీగా పెరిగిన వరద.. ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్

by Mahesh |
రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద భారీగా పెరిగిన వరద.. ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి నది ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలో భారీగా వరదలు వస్తున్నాయి. ఈ క్రమంలో రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో గంట గంటకు వరద ఉధృతి పెరిగిపోతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు రామన్నగూడెం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ ప్రస్తుతం 15.80 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తుండగా.. 15.83 మీటర్ల నీటి మట్టానికి చేరితే.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. తాజాగా వస్తున్న వరద కారణంగా జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed