Chicken Rate : మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు

by Mahesh |   ( Updated:2024-08-05 05:52:01.0  )
Chicken Rate : మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల నాలుగు వరకు ఆషాడ మాసం కావడంతో నగరంలో బోనాల పండుగ అంగరంగవైభవంగా జరిగింది. ఈ క్రమంలో నగరంలో చికెన్, మటన్ ధరలు భారీగా పెరిగాయి. దాదాపు 3 వారాల పాటు చికెన్ కేజీ ధర రూ. 280 నుంచి 300 వరకు వెళ్లింది. అయితే ఒక్కసారిగా ఈ చికెన్ ధరలు సోమవారం 180 కి పడిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే కేజీ చికెన్ రూ. 150 కే అమ్ముతున్నారు. చికెన్ ధరలు ఉన్నట్టుండి తగ్గడానికి ప్రధాన కారణం.. ఆదివారంతో ఆషాడ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభం అయింది. దీంతో నేటి నుంచి శ్రావణ మాస వ్రతాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలోనే హిందువులు తమ ఇండ్లలోకి మాంసాన్ని తీసుకురావడం మానేస్తారు. ఇందులో భాగంగా చికెన్ ధరలు భారీగా తగ్గినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు.

Advertisement

Next Story