- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా నుంచి హెల్త్ ఆఫీసర్లతో హరీష్ రావు రివ్యూ
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్రావు గురువారం అమెరికా నుంచి హెల్త్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దవాఖాన్ల పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. 65 మందికి ప్రొఫెసర్లకు, 210 అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్లు ఇచ్చామన్నారు.1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ కూడా పూర్తయిందన్నారు. నియామక ఉత్తర్వులు ఈ నెల 22 శిల్ప కళా వేదికలో జరిగే కార్యక్రమంలో అందజేస్తామన్నారు. ఇకమెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ రోల్ మోడల్ గా టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలన్నారు. ప్రతి మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులకు మానసిక ఒత్తిడి నుండి బయటకు వచ్చే విధంగా యోగా, ప్రాణాయామం వంటి తరగతులను ప్రారంభించాలన్నారు.800 మంది పీజీ ఎస్ఆర్లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రులకు అవసరం మేరకు ఇవ్వాలని మంత్రి సూచించారు.
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న 900 మంది తెలంగాణ విద్యార్థులకు ఒక ఏడాది ఇంటర్న్ షిప్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా పోస్టింగులు ఇవ్వడం జరిగిందన్నారు. క్లినికల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డ్యూటీల విషయంలో సూపరింటెండెంట్స్‌దే పూర్తి బాధ్యతని మరోసారి నొక్కి చెప్పారు. రౌండ్ ద క్లాక్ సేవలు అందించాలన్నారు.24 గంటలు షిప్టుల వారీగా డ్యూటీల్లో ఉండాల్సిందేనని మంత్రి చెప్పారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లోహెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేతా మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ. శ్రీనివాస రావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇంఛార్జి కమిషనర్ రమేష్ , టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి తో పాటు అన్ని జిల్లా ఆసుపత్రులు సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.