15 రోజుల్లో డెలివరీకి రేడిగా ఉన్న గర్భిణీలపై స్పెషల్ ఫోకస్: మంత్రి దామోదర

by Mahesh |
15 రోజుల్లో డెలివరీకి రేడిగా ఉన్న గర్భిణీలపై స్పెషల్ ఫోకస్: మంత్రి దామోదర
X

దిశ, తెలంగాణ బ్యూరో: డెలివరీకి 15 రోజులు గడువు ఉన్న గర్భిణీలందరి పై ఫోకస్ పెట్టాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. గ్రౌండ్ లెవల్ లో పనిచేసే స్టాఫ్​సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. ఆదివారం ఆయన వరద ప్రభావిత జిల్లాలైనా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాలో పరిస్థితులపై టెలీ కాన్ఫరెన్స్ లో రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, స్టాఫ్​సిచ్వేషన్ పై ఆరా తీశారు. మందులు, విద్యుత్ సరఫరాలో సమస్యలు రావొద్దన్నారు. ఎమర్జెన్సీ వాహానాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఇక చిన్నారులు, గర్భిణీ స్త్రీల టీకాల్లో లోపం కాకూడదన్నారు. మున్సిపల్, పంచాయతీ శాఖల సమన్వయంతో దోమలు నియంత్రణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ప్రభుత్వ కార్యదర్శి డా. క్రిస్టినా, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. రవీందర్ కుమార్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా . అజయ్ కుమార్ గారితో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఎమ్ హెచ్ వోలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed