జాతీయ జెండా ఆవిష్కరణలో ఒకే ఒక్కడు

by Sathputhe Rajesh |
జాతీయ జెండా ఆవిష్కరణలో ఒకే ఒక్కడు
X

దిశ, చందుర్తి : జాతీయ జెండాను ఒకే ఒక్క వ్యక్తి ఆవిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. చందుర్తికి చెందిన లింగం వెంకటి నేటితరం నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పూటకో పార్టీ మారుతున్న నేటి తరంలో ఒకే పార్టీలో 20 ఏళ్లుగా కొనసాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానిగా తెలుగుదేశం పార్టీలో చేరి సుమారు 20 సంవత్సరాలకు పైగా పార్టీ లోనే కొనసాగుతున్నారు.

టీడీపీ పార్టీ ఉనికిని కోల్పోయినా కూడా తాను మాత్రం వేరే పార్టీ లోకి మారలేదు. ప్రతి ఏటా జరిగే ఘనతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవ పండగలు తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నాడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చందుర్తిలో టీడీపీ జెండా గద్దె వద్ద ఒక్కడే నిలబడి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. నేటి తరం యువతకు ఆయన ఆదర్శమని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story