- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Saichand : విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో గొంతెత్తి.. అంతలోనే నింగికేగి..
దిశ, శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి వచ్చిన సాయిచంద్ అర్ధరాత్రి సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే సాయిచంద్ చనిపోయినట్లు నిర్ధారించారు. సాయిచంద్ మృతదేహాన్ని ఎంపీ సంతోష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. సాయిచంద్ వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న జన్మించారు. పీజీ వరకు చదువుకున్న సాయిచంద్ విద్యార్థి దశ నుంచే కళాకారుడుగా, గాయకుడిగా మంచి పేరుతెచ్చుకున్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన గళంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. 2021 డిసెంబర్ నెలలో సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు సీఎం కేసీఆర్. సాయిచంద్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. సాయిచంద్ హఠాన్మరణం బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నింపింది. సాయిచంద్ ఆకస్మిక మృతివార్త తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఆస్పత్రికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.