ఆ విషయంలో హీరో రవితేజకు హ్యాట్సాఫ్.. సంక్రాంతి సినిమాల విడుదల వివాదలపై క్లారిటీ ఇచ్చిన తెలుగు చలన‌చిత్ర వాణిజ్య మండలి

by Shiva |
ఆ విషయంలో హీరో రవితేజకు హ్యాట్సాఫ్.. సంక్రాంతి సినిమాల విడుదల వివాదలపై క్లారిటీ ఇచ్చిన తెలుగు చలన‌చిత్ర వాణిజ్య మండలి
X

దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల విడుదల వివాదాలపై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి మరోసారి క్లారిటీ ఇచ్చింది. థియేటర్ల కేటాయింపునుకు సంబంధించి పండుగ బరిలో ఉన్న ఐదు సినిమాల ప్రొడ్యూసర్లను 15 రోజుల క్రితం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి గ్రౌండ్ రియాలిటీ వివరించామని వారు తెలిపారు. ఈ క్రమంలో హనుమాన్, ఈగల్, సైంధవ్, గుంటూరు కారం, నా సామి రంగ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఛాంబర్ వినతిని మన్నించి సంక్రాంతి బరి నుంచి తప్పకునేందుకు ఈగల్ సినిమా నిర్మాత టి.విశ్వప్రసాద్, వివేక్, నటుడు రవితేజ సహకరించారని తెలిపారు. ఇలాంటి సమయంలో ఒక మాస్ హీరో తన సినిమాను వాయిదా వేసుకోవడంలో వెనక్కి తగ్గడం మాములు విషయం కాదన్నారు.

అదేవిధంగా తమిళ హీరోలు రజనీకాంత్, ధనుష్, శివ కార్తికేయన్ తమ సినిమా సహకరించి తమ సినిమాలను వాయిదా వేసుకున్నారని తెలిపారు. సంక్రాంతికి పోటీ ఉండాలి కానీ, అది ఆరోగ్యకర వాతావరణంలో ఉంటే మంచిదన్నారు. కానీ, కొన్ని సోషల్ మీడియా వెబ్‌సైట్లు, ఇతర మాధ్యమాలు పండుగ సమయంలో వాళ్ల రేటింగ్స్, టీఆర్పీల కోసం ఇష్టమైన రాతలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్స్, హీరోలు, ప్రొడ్యూసర్లు, దర్శకుల మధ్య చిచ్చులు పెడుతూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అలాంటి వార్తలు రాయకూడదనే బహిరంగా లేఖను విడుదల చేశామని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.

Advertisement

Next Story