- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కూకట్‌పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా ఊహించని పేరు..? ఆయనకే ఫిక్స్..
దిశ, వెబ్‌డెస్క్: రెండో జాబితా విడుదలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. ఢిల్లీలో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ముఖ్యనేతలు ఈ భేటీకి హాజరయ్యారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించి పేర్లను ఖరారు చేశారు. ఈ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపగా.. దసరా తర్వాత సెకండ్ లిస్ట్‌ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
ఈ రెండో లిస్ట్‌లో కూకట్‌పల్లి నుంచి హరివర్థన్ రెడ్డికి సీటు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. మేడ్చల్ నుంచి ఆయన టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయనను బుజ్జగించేందుకు కూకట్‌పల్లి నుంచి టికెట్ కన్ఫామ్ చేసినట్లు చెబుతున్నారు. మేడ్చల్‌లో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఒకవేళ ఆయన పార్టీని వీడితే నష్టం జరుగుతుందని భావించిన కాంగ్రెస్.. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.
గతంలో మేడ్చల్, పరిగి నియోజకవర్గాల నుంచి హరివర్ధన్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సారి మేడ్చల్ నుంచి పోటీ చేసేందుకు ఆయన చూస్తున్నారు. కూకట్‌పల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో పోటీ చేయడంపై దసరా తర్వాత నిర్ణయం తీసుకుంటానని హరివర్దన్ రెడ్డి ప్రకటించారు.