- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ శాఖలో సమస్యలు పరిష్కరించండి.. భట్టికి హరీష్ రావు లేఖ
దిశ, వెబ్‌డెస్క్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. పోలీస్ శాఖలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని.. తక్షణమే వాటిని పరిష్కరించాలని బుధవారం రాసిన లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. లీవ్ బెనిఫిట్స్ నిధులు కొన్ని జిల్లాలకు ఇచ్చి మరికొన్ని జిల్లాలకు ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. గత ఎనిమిది నెలలుగా లీవ్ బెనిఫిట్స్ పెండింగ్‌లో పెట్టారని గుర్తుచేశారు. పెట్రోల్, డీజిల్ బిల్లుల కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగీ జ్వరాల బారిన పడి 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించామని, నిధులు విడుదల చేసి పారిశుధ్య నిర్వహణ కొనసాగించాలన్నారు.