తెలంగాణ బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్ ఇదే..!

by Satheesh |   ( Updated:2024-07-25 10:59:43.0  )
తెలంగాణ బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బడ్జెట్ ఆత్మస్తుతి పరనిందలా ఉందని.. బడ్జెట్ రాష్ట్ర అన్ని వర్గాలను తీవ్ర నిరాశ పర్చిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. బడ్జెట్‌లో అంకెల గారడీ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్డెట్‌లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల ప్రస్తావన లేదని.. ఇది రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్లే బడ్జెట్ అని అభివర్ణించారు. మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి కానీ దురదృష్టవశాత్తూ అలా లేదని అన్నారు.

కాంగ్రెస్ హామీ ఇచ్చిన నెలకు రూ.2500 సాయం కోసం కోటి మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయినప్పటికీ మహిళలకు ఆర్థిక సహయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసరా పెన్షన్లు రూ.4 వేలకు పెంచుతామన్న హామీ ఇప్పటికీ నేరవేర్చలేదని నాలుగు వేల పెన్షన్ కోసం వృద్ధులు ఏడు నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ బడ్జెట్‌లో దీని ఊసే ఎత్తలేదని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో విద్యా భరోసా కార్డు అంవాన్ని ప్రభుత్వం మర్చిపోయింది.

కొత్త రేషన్ కార్డు ఎప్పటీ నుండి ఇస్తారో చెప్పలేదు. జ్యాబ్ క్యాలెండర్ ప్రస్థావన లేదని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని మేం నిర్లక్ష్యం చేశామన్నారు. కానీ హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ కొనసాగించిందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్‌ను సూపర్ స్టార్ రజనీ కాంత్ పొగిడారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి రజనీకి కనిపించింది కానీ కాంగ్రెస్ గజినీలకు కనిపించలేదు అని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన కారణంగానే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed