- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బీజేపీతో పొత్తుకు KCR అంగీకరించలేదు.. కవిత అరెస్ట్‌కు అదే కారణం’
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి.. మరోసారి కేసీఆర్ దమ్ముంటే దేశానికి చూపించాలని కార్యకర్తలకు సూచించారు. తాము బీజేపీతో పొత్తు పెట్టుకోలేదన్న అక్కసుతోనే కవితను అక్రమంగా జైలుకు తీసుకెళ్లారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే కవిత అరెస్ట్ అయ్యేవారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏనాడూ బీజేపీతో కలిసి లేడు.. బీఆర్ఎస్‌ది లౌకిక పార్టీ అని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటే నినాదంతో పార్టీ శ్రేణులు పనిచేయాలి.. ‘బీఆర్ఎస్ గెలవాలి.. తెలంగాణ నిలవాలి’ అని పిలుపునిచ్చారు.
Advertisement
Next Story