Topudu Bandi Sadiq : "తోపుడు బండి సాదిక్" ఇక లేరు.. ఎక్స్‌లో హరీశ్ రావు ఎమోషనల్ ట్వీట్

by Ramesh N |
Topudu Bandi Sadiq : తోపుడు బండి సాదిక్ ఇక లేరు.. ఎక్స్‌లో హరీశ్ రావు ఎమోషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: "తోపుడు బండి సాదిక్" (Topudu Bandi Sadiq) గా పేరొందిన సాదిక్ అలీ మృతి బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం X ఎక్స్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. వివిధ రకాలుగా సాదిక్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజల మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపారు. పిల్లల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు తోపుడు బండిలో పుస్తకాలు Books పెట్టుకొని, దాన్ని ఆయనే తోస్తూ ఊరూరా తిరుగుతూ పుస్తకాలు పంపిణీ చేయడం గొప్ప విషయం అని రాసుకొచ్చారు. సాదిక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. అని "తోపుడు బండి సాదిక్" ఫోటోను షేర్ చేశారు.

కాగా, సామాజిక సేవ, పేద విద్యార్థుల చదువుల కోసం కృషి చేస్తున్న "తోపుడు బండి సాదిక్ " ఫౌండర్ సాదిక్ అలీ గుండెపోటుతో మృతి చెందారు. (Secunderabad) సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ సాదిక్ తుదిశ్వాస విడిచినట్లు తాజాగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మృతిపై పలువురు సాహితీ ప్రియులు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. పేద విద్యార్థులకు తన తోపుడు బండిపై డిజిటల్ క్లాసులు చెప్పేవారని వారు గుర్తు చేసుకున్నారు. ఇక, పుస్తకాలతో 3500 కిలోమీటర్లు నడిచానని తోపుడు బండి సాధిక్ అలీ గతంలో దిశ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Advertisement

Next Story

Most Viewed