- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Harish Rao: వీరి సమస్యలు తక్షణమే పరిష్కరించాలి..! హరీష్ రావు డిమాండ్
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వేతలు కనిపించడం లేదా అని, వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలపై చర్చించారు. సమస్యలకు సంబందించి ఉద్యోగులు ఇచ్చిన వినతి పత్రాన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అలాగే ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా? ప్రశ్నించారు. అంతేగాక తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలకు పరిష్కారం చూపాలని, 7 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు ఎక్స్ లో రాసుకొచ్చారు.