- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Harish Rao: బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు తెలంగాణ పోలీస్ స్ట్రాంగ్ రిప్లై
దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్ శాఖ నిబద్దతతో పని చేస్తుందని, చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవటానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకాడబోమని తెలంగాణ పోలీస్ శాఖ ట్వీట్ చేసింది. అత్యాచారాలపై స్పందిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు పెట్టిన పోస్ట్ కు పోలీస్ శాఖ రిప్లై ఇచ్చింది. హరీష్ రావు ట్వీట్ చేస్తూ.. ఈ ఒక్కరోజే రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధాకరమని, సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అంతేగాక మహిళలకు భద్రత కరువైందని, పెరిగిన అత్యాచారాల గురించి అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాలేదని తెలిపారు. అలాగే చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి ఎందుకనే స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన తరుణం వచ్చిందని, మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరమని అన్నారు.
1.వనస్థలీపురం పిఎస్ పరిధిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం
2.ఓయూపిఎస్ పరిధిలో ప్రయాణీకురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం
3.నల్లగొండ జిల్లా శాలిగౌరారం లో దివ్యాంగ మహిళపై అత్యాచారం
4.నిర్మల్ నుండి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్
అని రాష్ట్రంలో జరిగిన అత్యాచారాలను ప్రస్తావిస్తూ.. అత్యాచార బాధితులను భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ సీఎంఓ, తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేశారు. దీనికి తెలంగాణ పోలీస్ శాఖ రిప్లై ఇస్తూ.. మన రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం కోసం మా పోలీస్ శాఖ అత్యంత నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. అంతేగాక జరిగిన ఘటనల పట్ల నిందితులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవటానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకాడబోమమని స్పష్టం చేశారు.