Harish Rao : కేటీఆర్ ఏం చేసిండు..? నీ లీకులకు ఎవడు భయపడడు : హరీశ్ రావు ఫైర్

by Ramesh N |
Harish Rao : కేటీఆర్ ఏం చేసిండు..? నీ లీకులకు ఎవడు భయపడడు : హరీశ్ రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డైవర్షన్ కోసం (KTR) కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తామని లీకులు ఇస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్‌ (CM Revanth Reddy) పై ధ్వజమెత్తారు. నీ లీకులకు, తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవడు భయపడడని (Harish Rao) ఫైర్ అయ్యారు. శనివారం మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్‌లో మీడియాతో హ‌రీశ్‌రావు మాట్లాడారు. కేటీఆర్ ఏం చేసిండు..? హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు. మీ అన్యాయాల‌ను ప్ర‌శ్నిస్తున్నాడని, మోసాల‌ను ఎండ‌గ‌డుతున్న కేటీఆర్‌పై కుట్రలు చేస్తున్నావ్.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఐటీలో (Telangana) తెలంగాణను నంబర్ 1 చేసిండని చెప్పారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరును కాదని హైదరాబాదుకు పెట్టుబడులు కేటీఆర్ తెచ్చిండని వివరించారు.

కేటీఆర్ నీ ప్రభుత్వాన్ని బట్టలు విప్పిండు, మీ అన్యాయాలను ప్రశ్నించిండు.. అందుకే నువ్వు ఆయన మీద పగ పట్టావు అని, ఇది కేటీఆర్ మీద దాడి కాదు రాష్ట్ర ప్రజల మీద దాడి, ప్రశ్నించే గొంతు మీద దాడి, బీఆర్ఎస్ పార్టీ (BRS) మీద దాడి అని హరీశ్ రావు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు అప్రజా స్వామికమన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి సీఎం, మంత్రులు గాలిమోటార్ల‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నారని ఆరోపించారు. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటామని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement

Next Story