Harish Rao : ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా..? : హరీష్ రావు సంచలన ట్వీట్

by Sathputhe Rajesh |
Harish Rao : ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా..? : హరీష్ రావు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తమ సమస్యల పరిష్కారం కోసం స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళనపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలే కాదు, ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. బదిలీల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతున్నదని స్టాఫ్ నర్సులు రెండు రోజులుగా తమ కుటుంబాలను వదిలి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా? గుర్తింపు లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story