- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Harish Rao: రేవంత్.. నువ్వు ఎన్ని బ్లాక్‌మెయిల్స్ చేసినా భయపడేది లేదు.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ (Warangal) రైతు డిక్లరేషన్ సభలో ప్రకటించిన ఒక్క హామీని అయినా నేరవేర్చారా అని ప్రశ్నించారు. రైతులు పండించిన సగం ధాన్యం ఇప్పటికే దాళారుల పాలైందని అన్నారు. కంపెనీల నిర్మాణాల కోసం తమకు సంబంధించిన వాళ్లకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారని అన్నారు.
రంగనాయక సాగర్ (Ranganayaka Sagar) దగ్గర ఇరిగేషన్ భూములను తాను కబ్జా చేశానని నాపై రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తప్పుడు ఆరోపణ చేయడం సిగ్గుచేటని అన్నారు. పచ్చ కామెర్లు వచ్చిన రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లుగా.. కబ్జాలు చేసే చరిత్ర రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి ఉందన్నారు. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా తాను 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నానని అన్నారు. ఒక గుంట, ఎకరం కాని ఇరిగేషన్ భూమిని తాను తీసుకున్నట్లుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. తాను ఏ భూమిని అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నానో.. ఆ భూమిలోనే ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలోనే సర్వే జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఎన్ని బ్లాక్‌మెయిల్స్ చేసినా భయపడేది లేదన్నారు. ప్రజలు, రైతుల పక్షాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునే ఉంటుందని హరీశ్‌రావు అన్నారు.