- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao : పాలకుడు నీతి తప్పాడు! సీఎంకు జ్ఞానోదయం కలగాలని మాజీ మంత్రి హరీశ్ రావు మొక్కులు!
దిశ, వేములవాడ/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, పాలకుడు నీతి తప్పాడని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. ప్రజలు ఎంతో భక్తితో (Vemulawada Rajanna Temple) వేములవాడ రాజరాజేశ్వరస్వామిని కొలుస్తారని.. అలాంటి రాజన్న మీద ఓట్టు పెట్టి రేవంత్ మాట(CM Revanth Reddy) తప్పాడని విమర్శించారు. మంగళవారం వేములవాడ రాజన్న దర్శనం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాజన్న మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు సాక్షాత్తు ఈ రాష్ట్ర సీఎం అని, పాలకుడు పాపం చేస్తే రాజ్యానికి అరిష్టమంటారని తెలిపారు. అలాంటి పాపాలు చేసిన రేవంత్ బారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని రాజన్నను వేడుకున్నానని వెల్లడించారు. అకాల వర్షాలు లేకుండా చూడాలని, సీఎం రేవంత్ కు జ్ఞానోదయం కలగాలని మొక్కులు తీర్చుకున్నానని అన్నారు. గుళ్లు, మసీదులు, చర్చీలకు వెళ్లి అన్ని దేవుళ్లపై ఒట్టు పెట్టిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తే నేడు ధాన్యం దళారుల పాలైందని ఆరోపించారు. ఇంకా 2లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు.
నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రం గడిచిన 12 నెలల్లో అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో రాష్ట్రం వెనుకబడిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిన విషయాన్ని లెక్కలతో సహా నిరూపిస్తానని సవాల్ చేశారు. లెక్కలు పట్టుకుని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి చర్చ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. రేవంత్ పాలనలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో 36 మంది విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. నెలకు ముగ్గురు విద్యార్థుల చొప్పున పొట్టన పెట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థులు ఆసుపత్రిలో.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, వారి కుటుంబ సభ్యులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు.. అశోక్ నగర్ లో నిరుద్యోగులపై లాఠీలు విరుగుతున్నాయని వివరించారు.
కేసీఆర్ తెలంగాణను వందేళ్ల ముందుకు తీసుకెళ్తే, రేవంత్ రెడ్డి వందేళ్ళ వెనక్కి తీసుకెళ్లాడని, ఇప్పటికైనా రేవంత్ కు జ్ఞానోదయం కలిగి పాలనపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, రేవంత్ కుసోయి కలగాలని రాజన్నను వేడుకున్నాం.. అని వెల్లడించారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు.. తెలంగాణ లేకపోతే రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యే వాడు కాదు.. ఈ రోజు సీఎం అయ్యే వాడు కాదని అన్నారు.