Harish Rao: బతుకమ్మకు ఇస్తామన్నా రెండు చీరలు, రూ.500 ఏవి?

by Gantepaka Srikanth |
Harish Rao: బతుకమ్మకు ఇస్తామన్నా రెండు చీరలు, రూ.500 ఏవి?
X

దిశ, వెబ్‌డెస్క్: బతుకమ్మ పండుగ(Bathukamma Festival) వేళ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. బతుకమ్మ పండుగ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని అన్నారు.

తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పాటు అయ్యాకే.. బతుకమ్మ రాష్ట్ర పండుగ అయిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బతుకమ్మ పండుగకు రెండు చీరలు, రూ.500 ఇస్తామన్నారు.. అవి ఎటు పోయాయని హరీష్ రావు ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి దాని మీద సోయే లేదని విమర్శించారు. అంతకుముందు మరో సందర్భంలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 30వేల ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల వల్లే అని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed