‘బీజేపీలోకి హరీశ్ రావు’ మోడీ ప్రమాణ స్వీకారం తెల్లారే టీకాంగ్రెస్ సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |
‘బీజేపీలోకి హరీశ్ రావు’ మోడీ ప్రమాణ స్వీకారం తెల్లారే టీకాంగ్రెస్ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అల్లుడు హరీశ్ రావును బీజేపీలోకి పంపేందుకు కేసీఆర్ కొత్త సర్కర్ మొదలు పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన సామ రామ్మోహన్.. అల్లుడు హరీశ్ రావును బీజేపీలోకి పంపి పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి.. నేను తిట్టినట్టు చేస్తా అనే మీ పాత ఎత్తుగడలు అర్థం కాక మీ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ఆగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. బిడ్డ కోసం, పార్టీ కోసం, ఆస్తుల కోసం అల్లుడు హరీశ్ భుజం పై తుపాకీ పెట్టి కాల్చే కుట్రలను తెలంగాణ గమనిస్తోందని ధ్వజమెత్తారు.

కాగా లోక్ సభ ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో కేంద్రంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో గతంలో పోలిస్తే బీజేపీ బలపడగా బీఆర్ఎస్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయనే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో హరీశ్ రావు రూపంలో కేసీఆర్ కొత్త కుట్ర చేస్తున్నారంటూ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

Next Story