- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హరీష్ రావు కు పిచ్చిపట్టింది, ఎర్రగడ్డ లో చేర్పించాలి.. కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి హరీష్ రావుకు పిచ్చిపట్టిందని, వెంటనే ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ నేత గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ..ఉపాధ్యాయుల దినోత్సవాన్ని రాష్ట్రమంతా సంబరంగా జరుపుకున్నా, హరీష్ రావు విమర్శలు కురిపిస్తున్నాడని మండిపడ్డారు. ఏఐ సమ్మిట్ నేపథ్యంలోనే సీఎం రవీంద్రభారతిలో జరిగిన సన్మాన సభకు రాలేదని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఏనాడైనా ఉపాధ్యాయులను కలిసి మాట్లాడారా? అంటూ గాలిరెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం నలభై వేల టీచర్లకు బదిలీలు నిర్వహించిందని గుర్తు చేశారు. ఎవ్వరికీ దొడ్డిదారిన జీవో లు ఇవ్వలేదని వివరించారు. బీఆర్ఎస్ హయం లో బెస్ట్ టీచర్ అవార్డులు దాదాపు 130 మందికి ఇచ్చిందని, కానీ తాము పారదర్శకంగా కేవలం 47 మందికి మాత్రమే ఇచ్చామన్నారు.బీఆర్ఎస్ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం బంద్ చేయడం మేలని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మానవతా రాయ్ పాల్గొన్నారు.