- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Dharmapuri Arvind: ‘ఆయనలా పాలించండి’.. సీఎం రేవంత్‌కు ధర్మపురి అర్వింద్ సూచన
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) కీలక సూచనలు చేశారు. గురువారం ఉదయం అర్వింద్ ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)లాగా కాకుండా.. చంద్రబాబు(Chandrababu) లాగా పాలించడం నెర్చుకోవాలని సూచించారు. గతంలో రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు అన్యాయం కలిగించేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు.. ఇప్పుడు ఆయన దారిలోనే రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా వెళ్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే లక్ష్యంగా పెద్ద పెద్ద కంపెనీలు, పెట్టుబడిదారులతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటున్నారని.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాజకీయకక్షలు తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయిందని అన్నారు. గొప్పలకు పోయి ఇచ్చిన రుణమాఫీ(Runa Mafi) పూర్తిగా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కాస్త కేసీఆర్ లాగా కాకుండా చంద్రబాబు లాగా పాలించడం నేర్చుకోండి అని హితవు పలికారు.