BRS ఫినిష్ కావాలనేదే హరీష్ రావు కోరిక.. CM రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Rajesh |
BRS ఫినిష్ కావాలనేదే హరీష్ రావు కోరిక.. CM రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ కావాలనేదే మాజీ మంత్రి హరీష్ రావు కోరిక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హరీష్ రావు ట్రాప్‌లో ఉండటంతో బీఆర్ఎస్ బతకడం కష్టమన్నారు. కేసీఆర్ పొలిటికల్‌గా నిలదొక్కుకోవడం కూడా జరగదని జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారని వాళ్లు తిట్టే తిట్లు, చేసే కామెంట్లను తట్టుకుని పోరాడారన్నారు. కోర్ ఏరియాను వదలలేదని తెలిపారు. ఇక్కడ మాత్రం కేసీఆర్ ఆ పని చేయడం లేదన్నారు.

హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే బీఆర్ఎస్ బతుకుతుందన్నారు. పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత ఉంటారని.. అందుకే బీఆర్ఎస్ ఫినిష్ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీష్ రావే అన్నారు. హరీష్ రావు ఎప్పుడూ ఏదో సంక్షోభాన్ని సృష్టించి తనకు అనుకూలంగా ఆ ఇష్యూను మలుచుకుంటారన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకాకపోతే హరీష్ రావే మాట్లాడతారని.. అందుకే హరీష్ వ్యూహ్యాత్మంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ గురించి మాట్లాడుతూ.. ఆయన డమ్మీయే అన్నారు.

Advertisement

Next Story

Most Viewed