- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి.. హరీష్ రావు డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: కోమటిరెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకమున్నా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా జెడ్పీ సమావేశంలో సందీప్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవమానించడాన్ని హరీష్ రావు ట్విటర్ వేదికగా ఖండించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులకు ఘోర అవమానం జరుగుతోందని.. మంత్రుల వైఖరి గర్హనీయమన్నారు.
మొన్న రైతుబంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి.. నేడు జెడ్పీ చైర్మన్‌పై అధికారిక కార్యక్రమంలో దుర్భాషలాడటం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. మాట్లాడింది చాలదన్నట్టు మంత్రి పోలీసులకు హుకూం జారీ చేసి బలవంతంగా సందీప్ రెడ్డిని బయటకు పంపిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వాదులంతా కోమటిరెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలని కోరారు.