- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao: జాబ్ క్యాలెండర్ ఒక జోక్.. యువతకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి
దిశ, తెలంగాణ బ్యూరో: శాసనసభ కౌరవ సభగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్ అని, విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ దగా చేసిందన్నారు. శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అన్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఎన్నికల ప్రచారంలో చెప్పారని, నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాలు తిప్పి ప్రచారం చేసుకున్నారన్నారు. గద్దెనెక్కినంక విద్యార్థులను మరచిపోయారని ధ్వజమెత్తారు. మొదటి క్యాబినెట్ లోనే జాబ్ క్యాలెండర్ అని, 8 నెలల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌లో ఏమైనా ఉన్నదా? అంటే అందులో ఏమీ లేదన్నారు.
అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే ఎవరు ఇచ్చారు అనేది ఉంటుందని, కానీ పేరు లేదు, సంతకం లేదు, ఒక చిత్తు కాగితం లాగా ప్రకటించారని అన్నారు. చర్చ కూడా లేకుండా ఉప ముఖ్యమంత్రి చదివి పారిపోయారన్నారు. లక్షలాది మంది యువతీయువకుల కంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటదా? అని ప్రశ్నించారు. చర్చ చేయమంటే ఎందుకు పారిపోయారని, దమ్ముంటే మాట్లాడాలి కదా అని నిలదీశారు. మాట్లాడే ముఖం లేదు కాబట్టి దానం నాగేందర్ కు మైక్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారన్నారు. మిమ్మల్ని వదిలి పెట్టబోమని, నిరుద్యోగుల తరుపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని వెల్లడించారు. అభయ హస్తం మానిఫెస్టోలో చెప్పినవి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు అన్నారు. రేవంత్ రెడ్డి గన్ మెన్ లేకుండా అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి రండి... మీరు ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయితే దమ్ముంటే రావాలని సవాల్ చేశారు. ఏ టైం చెబుతారో, డేట్ చెబుతారో చెప్పండి వస్తానన్నారు.
ఎన్ని రోజులు దాక్కుంటారు.. ఎన్ని రోజులు తప్పించుకుంటారని నిలదీశారు. యువతకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ నీ క్రెడిబులిటీ ఏంటి, నువ్వు రా సమాధానం చెప్పు లేకుంటే నిరుద్యోగుల యువతతో ఏఐసీసీ కార్యాలయానికి వస్తామని, అక్కడికి వచ్చి నిలదీస్తామని హెచ్చరించారు.సభలో ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇది ఉద్యమాల గడ్డ, దబాయింపులకు తావు లేదు... మమ్మల్ని బెదిరింపులు ఏం చేయవు అని పేర్కొన్నారు.