ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు: హరీష్ రావు

by Disha Web Desk 19 |
ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు: హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మెదక్‌లో మరోసారి తన మూర్ఖత్వాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తే సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు తాగు నీరు కూడా సరిగ్గా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. గతంలో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.. ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన మాత్రం రాజకీయాల నుండి తప్పుకోలేదని అన్నారు.

మాట మీద నిలబడే నైజం సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. ప్రధాని మోడీతో రేవంత్ కుమ్మక్యయారని హరీష్ రావు ఆరోపించారు. కాగా, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెమ్మేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.



Next Story