ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా?.. ముందు అది చెప్పండి: హరీష్ రావు

by Disha Web Desk 9 |
ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా?.. ముందు అది చెప్పండి: హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీ చేస్తామనే నమ్మకం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేటలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరపు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రుణామాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా? ముందు అది చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ప్రమాణం చేశారని గుర్తుచేశారు. వందరోజుల్లో గ్యారంటీలన్నీ అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఆరు గ్యారంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే నా రాజీనామాను స్వీకర్ ఆమోదించాలని కోరారు. తాను మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయబోను అని ప్రకటించారు. ఒకవేళ రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే రాజీనామాకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? అనే ప్రశ్నకు మాత్రం నోరు విప్పడం లేదని విమర్శించారు.

హామీలు నిజమైతే రాజీనామాకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సెటైర్ వేశారు. రాజీనామాకు ముందుకు రావట్లేదంటే ప్రజలను మోసగించినట్లే అని అన్నారు. ప్రజలనే కాదు ఆ దేవుళ్లను కూడా మోసం చేసినట్లే అని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదలమని హెచ్చరించారు. వెంట పడి మరీ అమలు చేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా అది మా బాధ్యత అన్నారు. మాట తప్పిన సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నాకు ఎమ్మెల్యే పదవి కంటే హామీలు అమలు చేయించడమే ముఖ్యమని వెల్లడించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖతో సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రాజీనామా లేఖను జర్నలిస్టు చేతిలో పెట్టి వెళ్తున్నానని హరీష్ రావు చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed