- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Harish Rao: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కారం, నూనె మెతుకులు : మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆదివారం సంచలన ట్వీట్ చేశారు. తాజాగా, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనె మెతుకులతో కడుపు నింపుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా హరీష్ రావు ఓ ఫొటోను ట్వీట్ చేశారు. భావిభారత పౌరుల పట్ల ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరమని ఫైర్ అయ్యారు.
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో నాటి నాటీ సీఎం కేసీఆర్ అల్పాహార పథకాన్ని ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. కానీ, కొత్త ప్రభుత్వం ఆ పథకాన్ని అటకెక్కించిందని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం అందించడంలోనూ తీవ్రంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కం హెల్పర్ల వేతనాలు పెండింగ్‌లో పెట్టారని, అందుకే విద్యార్థులకు ఇలాంటి దుస్థితి పట్టిందని మండిపడ్డారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరారు.