సిద్దిపేట బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి.. ఖండించిన హరీష్

by Mahesh |   ( Updated:2024-08-17 12:41:01.0  )
సిద్దిపేట బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి.. ఖండించిన హరీష్
X

దిశ, వెబ్ డెస్క్: శుక్రవారం అర్ధరాత్రి సిద్దిపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రాజీనామా చేయాలంటే పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి.. పలు వస్తువులను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. సిద్దిపేటలో క్యాంప్ ఆఫీస్‌పై దాడిని ఖండించిన ఆయన.. ఇది అప్రజాస్వామికం.. ఆందోళనకరం, పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం దారుణం. MLA ఇంటిపైనే దాడి జరిగితే ప్రజల పరిస్థితి ఏంటి ప్రభుత్వ ప్రాపర్టీని ధ్వంసం చేయడం సరికాదు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే హరీష్‌ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed