సర్పంచ్ వేధింపులు.. వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-28 10:41:05.0  )
సర్పంచ్ వేధింపులు.. వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళ
X

దిశ, భీమదేవరపల్లి : సర్పంచ్ వేధిస్తున్నాడంటూ, తమ భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ నిరసన వ్యక్తం చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొక్కల అపర్ణ అనే మహిళ ముస్తఫాపూర్ గ్రామ సర్పంచ్ ప్రభాకర్ తమపై దాడి చేశాడని ఆరోపించింది. చంపడానికి ప్రయత్నం చేశాడని తెలిపింది. తమ భూమిని గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, తమకు రక్షణ కరువైందని వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ నిరసన వ్యక్తం చేసింది. ముస్తఫాపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం సర్వే నంబర్ 222/B,200 లలో పిల్ల వాగు స్థలంలో ఉన్న స్థలం విషయంలో గతంలో గొడవలు జరిగాయని.. అయితే నిన్న సాయంత్రం తన భర్త పై సర్పంచ్ దాడికి దిగినట్లు బాధితురాలు తెలిపింది. సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆమెతో మాట్లాడి హామీ ఇవ్వడంతో కిందికి దిగింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed