హ్యాపీ బర్త్ డే కేసీఆర్.. విషెస్ మాత్రమే కాదు..

by sudharani |   ( Updated:2023-02-17 15:32:52.0  )
హ్యాపీ బర్త్ డే కేసీఆర్.. విషెస్ మాత్రమే కాదు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కేక్ కటింగ్ సంబురాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌కు దేవుడి అశిస్సులు ఉండాలని ప్రార్థన చేశారు. హృదయపూర్వకంగా సీఎంకు అభినందనలు తెలిపారు. అనంతరం కేఏపాల్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు.

''పాల్ గారు మీరు ఆదర్శ మూర్తి, ప్రపంచంలో మీ లాంటి వారు ఉండరు'' అని గతంలో తన గురించి సీఎం కేసీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌కు దీర్ఘ అయుష్షు, మంచి మనసు, మర్పు దేవుడు ప్రసాదించాలన్నారు. ఒకసారి కేసీఆర్ ఆలోచించాలని, తెలంగాణ రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని, బడుగు బలహీన వర్గాలకు అధికారం ఇవ్వాలని సూచించారు.

Also Read...

బీజేపీలో స్వాతంత్య్ర సమరయోధులు లేరు: వీహెచ్

Advertisement

Next Story