UK ఎన్నిక‌ల్లో హ‌న్మకొండ మ‌హిళా NRI విజ‌యం

by GSrikanth |
UK ఎన్నిక‌ల్లో హ‌న్మకొండ మ‌హిళా NRI విజ‌యం
X

దిశ‌, హ‌న్మకొండ టౌన్: హనుమకొండకు చెందిన ప్రవాస భారతీయురాలు హేమ ఎల్లాప్రగడ యూకేలో విజయం సాధించారు. మిస్లాండ్స్‌లో ఎన్నికలు జరిగాయి. మే 4న జరిగిన ఎన్నికల ఫలితాలు భారత కాలమానం ప్రకారం శనివారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో డిస్ట్రిక్ట్ కౌన్సిలర్‌గా ఆమె ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి తెలుగు మహిళగా ఘనత దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలో గత 30 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థులు మాత్రమే గెలుపొందుతున్నారని, ఇన్నేళ్ల తర్వాత గ్రీన్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం మరో అరుదైన గౌరవమని హేమ తెలిపారు. అక్కడి పాఠ్యాంశాల్లో తెలుగును చేర్చాలని కొన్నేళ్లుగా ఆమె ఉద్యమం చేస్తున్నారు. ఆమె తండ్రి సుదర్శన్ రావు కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో ప్రొఫెసర్‌గా రిటైర్డ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం హనుమకొండలోని పలువురు బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story